Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ చుట్టూ భారీ ఆసక్తి నెలకొంది. కెప్టెన్ తనూజ, ఆమె సేవ్ చేసిన రీతు చౌదరి తప్ప హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు. మరోవైపు ఈ వారం ఎవరూ సుమన్ శెట్టి ని కూడా నామినేట్ చేయలేదు. అందువల్ల హౌస్‌లో మొత్తం ఏడు మంది ఈ వారం ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. ఈ వారం నామినేట్ అయిన వారు చూస్తే.. భరణి, ఇమ్మాన్యుయెల్, సంజన, దివ్య, కళ్యాణ్, డీమాన్ పవన్ ఉన్నారు. ఇక ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో పెద్దగా టాస్క్‌లు జరగలేదు.
కానీ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చి వారికి మంచి బూస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఆట, స్ట్రాటజీ, ప్రోగ్రెస్—అన్నింటి గురించి వారి ఫ్యామిలీ సభ్యులు స్పష్టంగా మాట్లాడారు. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్స్‌లో కొత్త ఎనర్జీ కనిపించింది. అయితే బయట ఓటింగ్ ప్యాటర్న్ ప్రకారం ఈ వారం నామినేట్ అయిన వారిలో కళ్యాణ్ పడాలకి టాప్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఇమ్మాన్యుయెల్, భరణి , డీమాన్ పవన్ కూడా బలమైన ఓట్లు పొందుతున్నారు .సంజన & దివ్య డేంజర్ జోన్లో ఉన్నట్టు సమాచారం
ఓటింగ్ లెక్కలు చూస్తే కళ్యాణ్ ఈ వారం సేఫ్ మాత్రమే కాదు, విన్నర్ రేసులో కూడా బలంగా పరిగెడుతున్నట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్లలో దివ్య నిఖిత ఈ వారం బయటకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి ముఖ్య కారణాలు ఆటపై సరైన ఫోకస్ లేకపోవడం, హౌజ్‌లో అవసరం లేని డ్రామాపై ఎక్కువ దృష్టి పెట్టడం, భరణిపై చూపుతున్న ఒవర్-పొజెసివ్ నేచర్ ప్రేక్షకులను అసహనానికి గురిచేయడం. ఇంకా మిగిలిన నాలుగు వారాల్లో వీక్ కంటెస్టెంట్స్ తప్పక బయటకు రావాల్సిందేనని ట్రెండ్ చెబుతోంది. అందువల్ల ఈ వారం దివ్య ఎలిమినేషన్ దాదాపు ఖాయం అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఎలిమినేషన్ ఫలితం ఆదివారం ఎపిసోడ్లో తెలుస్తుంది. మొన్నటివరకు విన్నర్ రేస్ తనూజ vs ఇమ్మాన్యుయెల్ మధ్య నడిచింది. కానీ తాజాగా కళ్యాణ్ ఊహించని రీతిలో రేసులో ముందుకు వచ్చేశాడు. ఆడియన్స్ ప్రత్యేకంగా కామనర్ అయిన కళ్యాణ్‌ను బాగా సపోర్ట్ చేస్తున్నారు.