Kadiyam Srihari | హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు.
ఈ నెల 23వ తేదీ లోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. దీంతో వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్పీకర్‌ను కడియం శ్రీహరి కోరారు. ఢిల్లీ నుండి రాగానే స్పీకర్‌ను దానం నాగేందర్ కలవనున్నారు. దానం నాగేందర్ మరింత సమయం కోరుతాడా లేదా రాజీనామా చేస్తాడా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.