రామన్నపేట, నవంబర్ 21 : మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి నాల్గొవ వర్ధంతిని రామన్నపేటలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహా మాట్లాడుతూ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సొంత ఇల్లు కూడా లేకుండా యాదగిరిరెడ్డి తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసినట్లు కొనియాడారు. ప్రజలకు చేసిన సేవలు మరువలేనివన్నారు. నేటి యువత యాదగిరి రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, మండల సహాయ కార్యదర్శి కళ్లెం రామచందర్, సీనియర్ కామ్రేడ్ ఊట్కూరి భగవంతు, ఏనుతల రమేశ్, ఊట్కూరి కృష్ణ, సీహెచ్ మల్లేశం, మీసం గాలయ్య, కళ్లెం యాదగిరి, కొండ వీరస్వామి పాల్గొన్నారు.