నల్లగొండ, ఫిబ్రవరి 20 : నల్లగొండ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల హాస్టల్ విద్యార్థిని వల్కి ద్రక్షిత రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. స్థానిక జేబీఎస్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ద్రక్షిత నల్లగొండలో జరిగిన జిల్లాస్థాయి అండర్-14 సీఎం కప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొననుంది. విద్యార్థినిని ఎస్సీడీడీ డిప్యూటీ డైరెక్టర్ శశికళ, హాస్టల్ హెచ్డబ్ల్యూఓ భారతమ్మ అభినందించారు. మున్ముందు జాతీయ పోటీలకు సైతం ఎంపికై జిల్లాకు పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు.