పెద్దపల్లి : కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు ( ACB Raid ) పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ కాసర్లి రాజేందర్ ( Sub registrar Rajendar ) శుక్రవారం మధ్యాహ్నం బాధితుడి నుంచి రూ. 16,500 లు తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన కరీంగనర్ యూనిట్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న డాక్యూమెంట్ రైటర్ రషీద్‌ను సైతం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇద్దరిని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.