Harish Rao : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటోందని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తమ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మీద రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టి 80 శాతం పనులు పూర్తి చేశామని పేర్కొన్న ఆయన రేవంత్ ప్రభుత్వం కనీసం రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేదని మండిపడ్డారు.
‘కేసీఆర్ పాలనలో మేము దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యమిచ్చాం. రూ.7.300 కోట్ల ఖర్చుతో 47 వేలు ఉన్న ఆయకట్టును, 3 లక్షల 17 వేల ఎకరాలకు పెంచాం. మరో 33 వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరమవ్వగా.. 30 వేల ఎకరాలు భూసేకరణ కూడా పూర్తి చేశాం. ఇంకొక 3వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. దాదాపు రూ.1,000 నుండి రూ.2,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 2,40,000 ఎకరాల ఆయకట్టు సృష్టించవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏండ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదు’ అని కాంగ్రెస్‌పై హరీష్ రావు విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మీద రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేశాము
47 వేలు ఉన్న ఆయకట్టును, 3 లక్షల 17 వేల ఎకరాలకు పెంచాము
33 వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే, 30 వేల ఎకరాలు భూసేకరణ కూడా పూర్తి చేశాము
ఇంకొక 3వేల ఎకరాలు భూసేకరణ చేసి, దాదాపు రూ.1,000… https://t.co/MCmeVZup6m pic.twitter.com/qWXzGNf7Ro
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026