BLA | పాక్ సైనికుల్ని నిర్బంధించిన బీఎల్ఏ.. తమ వాళ్లే కాదంటున్న పాక్.. ఐడీలు చూపిన బంధీలు
BLA : పాకిస్తాన్ సైన్యానికి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కి మధ్య నడుస్తున్న సైనికుల కిడ్నాప్ అంశం కీలక మలుపు తిరిగింది. బీఎల్ఏ ఆధీనంలో ఉన్న సైనికులు తమ వాళ్లు కాదని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.
BLA : పాకిస్తాన్ సైన్యానికి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కి మధ్య నడుస్తున్న సైనికుల కిడ్నాప్ అంశం కీలక మలుపు తిరిగింది. బీఎల్ఏ ఆధీనంలో ఉన్న సైనికులు తమ వాళ్లు కాదని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో బీఎల్ఏ చెరలో ఉన్న పాక్ సైనికులు తమ ఐడీలు చూపించారు. పాక్ ఆర్మీ తమను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి చివరి వారంలో పాక్ సైన్యంపై బీఎల్ఏ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాక్ సైనికులు, బీఎల్ఏ సభ్యులు కూడా మరణించారు.
రెండువైపులా కొందరినీ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దాడుల సందర్భంగా బీఎల్ఏ సభ్యుల్ని పాక్ ఆర్మీ అరెస్ట్ చేస్తే.. కొందరు పాక్ సైనికుల్ని బీఎల్ఏ కిడ్నాప్ చేసింది. తమ ఆధీనంలో ఏడుగురు పాక్ సైనికులు ఉన్నట్లు ఇటీవల బీఎల్ఏ ప్రకటించింది. బంధీలుగా ఉన్న పాకిస్తాన్ సైనికులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా విడుదల చేసింది. వారిని విడుదల చేయాలంటే పాకిస్తాన్ ఆర్మీ అరెస్టు చేసిన తమ వారిని విడుదల చేయాలని బీఎల్ఏ డిమాండ్ చేసింది. లేకుంటే తమ ఆధీనంలో ఉన్నవారిని చంపేస్తామని హెచ్చరించింది. ఇందుకు ఈ నెల 22 వరకు గడువిచ్చింది. అంటే ఇంకా రెండు రోజులే ఉంది. అయితే, ఈ విషయంలో పాకిస్తాన్ భిన్నంగా స్పందించింది. తమ సైనికులకు సంబంధించి ఎవరూ మిస్ కాలేదని తెలిపింది.
🚨 DEVELOPING: With only 3 days left in the 7-day deadline set by the BLA, new footage has emerged purportedly showing Pakistani Army personnel in custody.
Despite official silence, the video evidence appears to contradict previous denials of the capture. The BLA warns of… pic.twitter.com/FwvWLIyLOa
— SILENT BRIEF (@SilentBriefHQ) February 20, 2026
అంతేకాదు.. బీఎల్ఏ ఆధీనంలో ఉన్నవారు తమ సైనికులే కాదని తేల్చిచెప్పింది. దీంతో బంధీలుగా ఉన్న పాక్ సైనికులు షాకయ్యారు. తమకు సంబంధించిన ఐడీలు చూపిస్తూ వీడియో విడుదల చేశారు. ఈ ఐడీ కార్డు పాక్ ప్రభుత్వమే జారీ చేసిందన్నారు. తాము పాక్ సైనికులం కాకుంటే మరెవరని ప్రశ్నించారు. తమ కుటుంబ పరిస్థితి గురించి వివరించారు. తాము దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధమైతే.. తమ దేశం కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం చివరకు ఎటు వెళ్తుందో చూడాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

