అమరావతి : ఏపీలో టీడీపీ నాయకులు (TDP leaders) రెచ్చిపోయారు. ఆసుపత్రిలో బాధితుడిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో డాక్టర్ ( Doctors ) , వైద్య సిబ్బంది ( Medical staff) పై వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద గొడవ జరగగా గాయపడ్డ వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, వైద్య సిబ్బంది పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులు
సీసీ కెమెరాలో రికార్డయిన దాడి దృశ్యాలు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద గొడవ జరగగా గాయపడ్డ వ్యక్తి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
అయితే మరోసారి దాడి… pic.twitter.com/ttBqdkqUzK
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2025
అయితే కొందరు టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడిపై దాడికి యత్నించారు. అడ్డుకున్న డాక్టర్, వైద్య సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. టీడీపీ నాయకుల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కదిరిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. విధులను బహిష్కరించి టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.