అమరావతి : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు ( Raghu Rama Krishna Raju ) వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan ) కి పలు సూచనలు చేశారు. ఈసారి అసెంబ్లీ ( AP Assembly ) సమావేశాలకు వైఎస్ జగన్ రాకపోతే డిస్క్వాలిఫై అవుతారని, పులివెందులకు ఉప ఎన్నికలు జరగడం ఖాయమని పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాను అడుగుతున్న జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్‌గా డిస్ క్వాలిఫై అయిపోతారని వెల్లడించారు. వయసులో పెద్దవాడిగా, శాసనసభా ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావడానికి జగన్ సిద్ధమా అని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారని, ఆ సవాల్‌ను జగన్ స్వీకరించాలని సూచించారు.