SIIMA 2025 | దుబాయ్ వేదికగా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రోజులు జరుగునున్న ఈ వేడుకలలో మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాలకు అవార్డులను ప్రకటించగా.. రెండో రోజు తమిళంతో పాటు మలయాళం సినిమాలకు అవార్డులను ప్రకటించనున్నారు. ఇక మొదటి రోజు తెలుగు అవార్డులను ప్రకటించగా.. ఇందులో ‘పుష్ప 2: ది రూల్’ సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌తో పాటు ‘శ్రీవల్లి’ పాత్రకు గాను రష్మిక ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అలాగే ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కూడా అవార్డులను అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి అవార్డును అందుకుంది.
మరోవైపు ఈ అవార్డులలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చీరకట్టుతో అవార్డు వేడుకలకి వచ్చిన ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.