అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ( AP Assembly ) ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Nazeer ) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారోనన్న విషయాన్ని ప్రకటించలేదు.
దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశముంది. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన వరదలు, వర్షాలకు జరిగిన నష్టం, తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.