భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భూవనగిరిలో (Bhuvanagiri) వినాయక నిమజ్జనం (Ganesh Nimajjanam) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. ఘనంగా ఊరేగించిన అనంతరం గణనాథునిడి నిమజ్జనం కోసం శుక్రవారం రాత్రి భువనగిరి చెరువు వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో క్రేన్ సహాయంతో ట్రాక్టర్లో నుంచి వినాయకుడిని పైకి ఎత్తారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్రేన్ తాడు తెగిపోవడంతో గణేశుని విగ్రహం ట్రాక్టర్లోనే పడిపోయింది. దీంతో అందులో కూర్చున్న ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.
షాకింగ్ వీడియో
యాదాద్రి భువనగిరి జిల్లాలో క్రేన్ తెగి భక్తుల మీద పడ్డ వినాయక విగ్రహం
ఇద్దరికి గాయాలు pic.twitter.com/ssLjUtyYD7
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025