Tax raids | ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరు (Bengaluru)లో దాడులు నిర్వహించారు (Tax raids). గత రెండు రోజులుగా దాదాపు 16 ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది.
రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు బెంగళూరులోని 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు, బంగారు వ్యాపారుల (gold merchants) ఇళ్లలో, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 కేజీల 923 గ్రాముల బంగారం పట్టుబడింది. పట్టుబడిన బంగారం విలువ రూ.6 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు రూ.1.33 కోట్ల నగదు, బినామీ ఆస్తులు, డీడీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read..
Kangana Ranaut | దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపై ఆ అలలు కొనసాగుతాయ్ : కంగనా రనౌత్
Patanjali | మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి.. రెండు రోజుల్లో రెండోసారి