Summer Schools | కాల్వ శ్రీరాంపూర్, ఏప్రిల్ 29 : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డీఈఓ పర్యవేక్షణలో మునుపెన్నడూ లేని విధంగా మే 1న ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకానున్న వేసవి పాఠశాలల్ని వాలంటీర్లు విజయవంతం చేయాలని శ్రీరాంపూర్, ఓదెల మండలాల విద్యాధికారులు (ఎంఈఓలు) సిరిమల్ల మహేష్, యర్రా రమేష్ కోరారు. ఇవాళ శ్రీరాంపూర్ జడ్పీ హైస్కూల్లో వేసవి బడుల ఒక రోజు శిక్షణా కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ.. వాలంటీర్లుగా పని చేసిన వారికి గౌరవ వేతనం ఉంటుందన్నారు. జూన్ 10వ తేదీ తర్వాత జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేస్తారని తెలిపారు. శ్రీరాంపూర్ ఓదెల, మండలాల్లో వేసవి పాఠశాలలు ఏర్పాటు చేసిన గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని వేసవి బడులకు పంపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్ సంధి సంపత్ రెడ్డి, టీం లీడర్ సమీద్ కాంప్లెక్స్, హెచ్ఎంలు నరెడ్ల సునీత, డి.సత్యలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, ఓదెల, శ్రీరాంపూర్ మండలాల వాలంటీర్లు, పలువురు పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి