హను రాఘవపూడి (Hanu Raghavapudi) వార్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ సీతారామమ్ (Sita Ramam). మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సుమంత్ అక్కినేని బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నటిస్తున్నాడు. సీతారామం ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
కాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో జోస్యం చెప్పాడు సుమంత్. సీతారామం 2006లో తాను నటించిన గోదావరి సినిమాలా క్లాసిక్ చిత్రంగా ఉండబోతుందని చెప్పాడు సుమంత్. ఈ చిత్రంలో సుమంత్ భార్యగా భూమికా చావ్లా నటిస్తోంది. కన్నడ భామ రష్మిక మందన్నా సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. పెళ్లి చూపులు ఫేం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలాజీ పాత్రలో, రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్ పాత్రలో నటిస్తున్నారు.
ప్రకాశ్‌రాజ్ ఈ చిత్రంలో మరో కీ రోల్ పోషిస్తున్నాడు. సీతారామంను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : DJ Tillu 2 | డీజేటిల్లు 2 డైరెక్టర్‌గా రామ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..?
Read Also : Atal Bihari Vajpayee Look | ‘ఎమర్జెన్సీ’ నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి లుక్
Read Also : Bimbisara Release Trailer | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది..’బింబిసార’ రిలీజ్ ట్రైలర్