డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో బాక్సాపీస్‌ను షేక్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda). విమల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి మంచి హిట్టునందించింది. ఇక మరోసారి డీజేటిల్లు 2 (DJ Tillu 2)తో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. సృజనాత్మక విభేదాల కారణంగా విమల్ కృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు గాసిప్స్ ఇప్పటికే తెరపైకి వచ్చాయి.
తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. నరుడా డోనరుడా, అద్బుతమ్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన మల్లిక్ రామ్ డీజేటిల్లు 2ను డైరెక్ట్ చేయబోతున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అంతేకాదు స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమంటున్నారు సినీ జనాలు.
ఫస్ట్ పార్టు తెరకెక్కించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) తో కలిసి సీక్వెల్‌ను తెరకెక్కించనుందని టాలీవుడ్ సర్కిల్ సమాచారం. రామ్ మిరియాలా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించనున్నట్టు టాక్..మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పక్కా హైదరాబాదీ స్టైల్లో సాగిన డీజే టిల్లు ఎంటర్టైన్మెంట్ ఈ సారి రెట్టింపు స్థాయిలో ఉండబోతుందా..? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.