Bimbisara Release Trailer | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది..’బింబిసార’ రిలీజ్ ట్రైలర్
ఇప్పటికే విడుదలైన బింబిసార (Bimbisara) ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్ (Bimbisara Release Trailer)ను విడుదల చేశారు.
నందమూరి హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం బింబిసార (Bimbisara). వశిష్ఠ్ (Vasisth) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్ (Bimbisara Release Trailer)ను విడుదల చేశారు.
‘హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులను ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి..’ అంటున్న డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్. ‘ నాడైనా..నేడైనా..త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుని కత్తిని దాటాలి..’ అంటూ ఓ వైపు స్టైలిష్ గా కనిపిస్తూ..మరోవైపు బింబిసారుడి లుక్‌లో యాక్షన్ సన్నివేశాల్లో అదరగొడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు కల్యాణ్ రామ్.
ఎంఎం కీరవాణి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాడని ట్రైలర్ కట్‌తో అర్థమవుతుంది. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
బింబిసారలో వెన్నెల కిశోర్, వరీనా హుస్సేన్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బింబిసారకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. బింబిసార ఆగస్టు 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి.
Read Also : DJ Tillu 2 | డీజేటిల్లు 2 డైరెక్టర్‌గా రామ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..?
Read Also : Atal Bihari Vajpayee Look | ‘ఎమర్జెన్సీ’ నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి లుక్
Read Also : Thank You | థ్యాంక్యూలో ప్రముఖ నటుడి సీన్లు డిలీట్..నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

