Thank You | థ్యాంక్యూలో ప్రముఖ నటుడి సీన్లు డిలీట్..నిజమెంత..?
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థ్యాంక్యూ (Thank You). జులై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)హీరోగా నటించిన చిత్రం థ్యాంక్యూ (Thank You). విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాశీఖన్నా (Raashi Khanna), మాళవికా నాయక్, అవికాగోర్, హీరోయిన్లుగా నటించారు. జులై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో స్క్రీనింగ్ అవుతున్నదని ట్రేడ్ సర్కిల్ టాక్. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా రన్‌టైం 129 నిమిషాలు..కాగా ఒరిజినల్ రన్ టైం మాత్రం 2 గంటల 45 నిమిషాలు ఉందట. అయితే మిగిలిన పార్టును తొలగించారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంటే 30 నిమిషాలపైనే..పోస్టర్లో కనిపించిన ప్రముఖ యాక్టర్ సునీల్ (Sunil)మాత్రం సినిమాలో కనిపించలేదు. డిలీటెడ్ వెర్షన్లోనే సునీల్‌కు సంబంధించిన సన్నివేశాలు ఎగిరిపోయారని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.
కథానుగుణంగా సునీల్ ఈ చిత్రంలో నాగచైతన్యకు సీనియర్‌గా కానీ, లేదంటే లెక్చరర్‌గా కనిపించాల్సి ఉండగా..అలాంటిదేమి సినిమాలో కనిపించకపోయే సరికి మూవీ లవర్స్ నిరాశ చెందారన్న టాక్ జోరుగా నడుస్తోంది. మొత్తానికి మేకర్స్ ఇప్పటికైనా ఆ సన్నివేశాలను యూట్యూబ్‌లో కానీ, ఓటీటీ వెర్షన్లో కానీ చూపిస్తారేమోనని చైతూ, సునీల్ ఫాలోవర్లు ఎదురుచూస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఇంతకీ సీన్లు డిలీట్ చేసింది ఎంతవరకు నిజమనే దానిపై మేకర్స్ కానీ, చైతూ టీం కానీ ఏమైనా స్పందిస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు. ఒక వేళ ఇది నిజమే అయితే మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి. థ్యాంక్యూ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథనందించారు.
Read Also :Aadi Sai Kumar | ట్విటర్‌లోకి స్వాగతం..యువ హీరో వీడియో ట్రెండింగ్
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Sai Pallavi Bonam | బోనమెత్తిన సాయిపల్లవి..ట్రెండింగ్‌లో డైరెక్టర్ స్పెషల్ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

