యాక్టింగ్, అదిరిపోయే డైలాగ్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ సాయికుమార్ (Sai Kumar). ఆయన నట వారసత్వాన్ని కొనసాగించేందుకు సిల్వర్ స్క్రీన్‌పై ప్రేమ కావాలి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). ఆ తర్వాత హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడీ యువ హీరో.
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా కాలం తర్వాత ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆది. ఈ యంగ్ యాక్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ (Twitter)లో జాయిన్ అయ్యాడు. హాయ్..ఫైనల్‌గా ట్విటర్‌లోకి వచ్చాను. నా సినిమా అప్ డేట్స్ ఇన్నీ కూడా ఫాలో అవ్వండి. ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేస్తారు..ఆదరిస్తారు..అలాగే ఎంకరేజ్ చేయాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..@iamaadisaikumar నా ట్విటర్ అకౌంట్. ఛీర్స్ గాయ్స్..అంటూ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఆది సాయికుమార్ తెలుగు, తమిళ ప్రాజెక్టు జంగిల్లో నటిస్తున్నాడు. దీంతోపాటు కిరాతక, సీఎస్ఐ సనాతన్, క్రేజీ ఫెలో, టాప్ గేర్,Amaran in the City: Chapter 1 చిత్రాలు ఆది సాయికుమార్ ఖాతాలో ఉన్నాయి.
#aadisaikumar finally in twitter 👍 pic.twitter.com/D5ye5A3QdP
— Aadi saikumar (@iamaadisaikumar) July 23, 2022
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Thank You | థ్యాంక్యూలో ప్రముఖ నటుడి సీన్లు డిలీట్..నిజమెంత..?
Read Also : Sai Pallavi Bonam | బోనమెత్తిన సాయిపల్లవి..ట్రెండింగ్‌లో డైరెక్టర్ స్పెషల్ ట్వీట్