పెద్దపల్లి : జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ ఎం) కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలు ( Pending Salaries ) చెల్లించాలని మంగళవారం డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వాణిశ్రీ( DMHO Vanishree ) కి ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎల్. సురేష్ నాయక్ మాట్లాడుతూ ప్రతీ నెలా ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల సెలవులు మంజూరు చేయాలని కోరారు.
ఎన్.టి.ఈ.పీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెట్రోల్ అలవేన్సులు టీఏ, డీఏ 3సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు డిప్యూటేషన్లు , బదిలీల అవకాశం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీపీఎం ప్రభాకర్, గోపి, తిరుపతి, రవీందర్, శ్రీనివాస్, శ్రావణి, సురేందర్, అంజయ్య, సురేష్, పావని, మమత, సంపత్, తదితరులు పాల్గొన్నారు.