కట్టంగూర్, నవంబర్ 04 : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ అన్నారు. మంగళవారం మునుకుంట్ల, కట్టంగూర్, ఈదులూరు పాఠశాలల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట కంటి ఆస్పత్రి సహకారంతో ఉచిత దంత, కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులకు, గ్రామస్తులకు కంటి, దంత పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 15 మందిని ఉచిత ఆపరేషన్ కోసం సూర్యాపేట కంటి ఆస్పత్రికి తరలించారు.
ఈ కార్యక్రమంలో దంత, కంటి వైద్యులు ఓరుగంటి శ్రీనివాస్, అగర్వాల్, విజన్ టెక్నిషియన్ స్వాతి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మల పిచ్చయ్య, ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి సాగర్, కోశాధికారి పోగుల రాములు, సభ్యుల మంగదుడ్ల శ్రీనివాస్, తవిదబోయిన నర్సింహ్మ, కడవేరు మల్లికార్జున్, రాపోలు వెంకటేశ్వర్లు, ఎర్రమాద అశోక్, వేముల సాయికుమార్, గడుసు శంకర్ రెడ్డి పాల్గొన్నారు.