పెగడపల్లి : ప్రభుత్వం అందించే సరుకుల్లో నాణ్యత కొరవడుతుంది. ముఖ్యంగా రేషన్ షాప్ల ( Ration Shops ) ద్వారా అందిస్తున్న సరుకుల్లో రకరకాల వింత వస్తువులు బయటపడుతున్నాయి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవల్లి గ్రామంలో మంగళవారం రేషన్ బియ్యంలో గాజు గ్లాస్ ( Glass Piece) ముక్క బయటపడింది.
గ్రామానికి చెందిన గొల్లపల్లి కవిత మంగళవారం స్థానిక రేషన్ షాపు నుంచి బియ్యం తీసుకొచ్చుకోగా అందులో గాజు గ్లాస్ ముక్క రావడంతో నివ్వరపోయింది. గమనించకుండా అన్నం వండుకొని తింటే ఇక అంతే సంగతులని లబ్దిదారులు వాపోతున్నారు.
గ్రామస్థులు దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది. ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుందని ప్రకటనలు చేస్తుండగా, బియ్యం నాణ్యతగా లేవని, సన్న బియ్యంలో ఎక్కువ శాతం నూకలు, దొడ్డు బియ్యం కలుస్తున్నాయని ఆరపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఉప్పలంచ లక్ష్మణ్ ఆరోపించారు.