Army chief | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ (Army chief General) జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదాన్ని (state-sponsored terror) ఆపకపోతే దాని చారిత్రక, భౌగోళిక (geography) ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని ఆర్మీపోర్టును సందర్శించిన ద్వివేది.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ పాక్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో భారత్ కాస్త సహనాన్ని ప్రదర్శించింది. మరోసారి రెచ్చగొడితే.. భారత్ ఎలాంటి సంయమనం చూపదు. మరో అడుగు ముందుకేస్తాం. సిందూర్ 2.0 ఉంటుంది. ప్రపంచ చరిత్ర, భౌగోళికంలో తన స్థానాన్ని నిలుపుకోవాలా..? లేదా..? అనే దానిపై పాక్ పునరాలోచించుకోవాలి. ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలి. లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి ఉంటుంది.. జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.
Also Read..
Karur Stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సిట్ విచారణకు ఆదేశించిన మద్రాసు హైకోర్టు
Operation Sindoor: అవన్నీ అందమైన కట్టుకథలు: ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్
Snow Leopards | హిమాచల్ ప్రదేశ్‌లో 83 మంచు చిరుతలు.. నాలుగేండ్లలో 62 శాతం పెరుగుదల : సర్వే