Snow Leopards | హిమాచల్ ప్రదేశ్‌లో 83 మంచు చిరుతలు.. నాలుగేండ్లలో 62 శాతం పెరుగుదల : సర్వే
Snow Leopards | హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు చిరుతల (Snow Leopards) సంఖ్య పెరిగింది.
Snow Leopards | హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు చిరుతల (Snow Leopards) సంఖ్య పెరిగింది. ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో అరుదైన మంచు చిరుతల జనాభా గత నాలుగేండ్లలో 62 శాతం పెరిగినట్లు రాష్ట్ర అటవీ శాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంచు చిరుతలు ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. 2021లో ఆ సంఖ్య 51గా ఉన్నట్లు పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ (Himachal Pradesh Forest Department) కు చెందిన వైల్డ్ లైఫ్ వింగ్ (Wildlife Wing) సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలో మంచు చిరుతలు నివసించే 26,000 కి.మీ విస్తీర్ణంలోని ఆరు ప్రదేశాలను కవర్ చేశారు. కొండలు, బండరాళ్లు, పొలాలు, ఎత్తైన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు. ఏడాది కాలంగా నిర్వహించిన ఈ సర్వేలో 83 మంచు చిరుతలు కెమెరాలకు చిక్కాయి. లాహౌల్-స్పితి, కిన్నౌర్, పాంగి లోయలోని గిరిజన ప్రాంతాల్లో మంచు చిరుతలు, వాటి ఆవాసాలను గుర్తించారు.
ఇక ఈ సర్వే విజయవంతం కావడానికి స్థానికుల భాగస్వామ్యం చాలా కీలకమని అధికారులు తెలిపారు. స్పితిలోని కిబ్బర్ గ్రామానికి చెందిన స్థానిక యువకులు, మహిళలు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు, డేటా విశ్లేషణకు సాయం చేసినట్లు చెప్పారు. ఫ్రంట్‌లైన్ అటవీ అధికారులు, తదితరులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. వారి సాయంతో ఈ సర్వేని ఏడాదిలోనే పూర్తి చేసినట్లు వివరించారు.
కాగా, గతేడాది ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)’ నిర్వహించిన శాస్త్రీయ గణనలో దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. దేశంలో మంచు చిరుతలు నివసించే 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో (లఢఖ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ ) 70 శాతానికి పైగా ప్రదేశాన్ని ఈ శాస్త్రీయ గణన కవర్ చేసిందని కేంద్రం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లపాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. మొత్తం 1971 ప్రాంతాల్లో 1.80 లక్షల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు. అందులో అత్యధికంగా లఢఖ్‌లో 447 చిరుతలు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో 124, హిమాచల్‌ప్రదేశ్‌లో 51, అరుణాచల్‌ప్రదేశ్‌లో 36, సిక్కింలో 21, జమ్ము కశ్మీర్లో 9 మంచు చిరుతలు ఉన్నాయి.
Also Read..
Aadhar Update | ఆధార్ అప్డేట్ చేసుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన సర్వీస్ ఛార్జెస్
Cough syrup | చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. కిడ్నీ వైఫల్యంతో తొమ్మిది మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

