Aadhar Update | నేటి సమాజంలో ఆధార్ కార్డు (aadhaar card) వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి వాటికి అధార్ తప్పనిసరి అయ్యింది. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. దీంతోపాటు ఇంటి చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఎప్పటికప్పుడు ఆధార్‌ను అప్డేట్ (Aadhar Update) చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్‌లో మార్పులు, చేర్పులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India) ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ అప్ డేట్ సర్వీసు ఛార్జీలను ఉడాయ్ తాజాగా సవరించింది. పెరిగిన ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి సెప్టెంబర్ 30, 2028 వరకు చెల్లుబాటు అవుతాయి. సర్వీసును బట్టి ఛార్జెస్‌లో మార్పులు ఉంటాయి. ఉడాయ్ సవరించిన ఆ సర్వీసు ఛార్జీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read..
Cough syrup | చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. కిడ్నీ వైఫల్యంతో తొమ్మిది మంది మృతి
Canada Theatre | థియేటర్‌పై వరుస దాడులు.. కెనడాలో భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేత
Taliban Minister | త్వరలో భారత పర్యటనకు తాలిబన్ మంత్రి