Taliban Minister | అప్ఘానిస్థాన్ (Afghanistan) విదేశాంగ శాఖ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ (Amir Khan Muttaqi) త్వరలో భారత్ (India)లో పర్యటించనున్నారు. ఆయనపై ఉన్న అంతర్జాతీయ ప్రయాణ నిషేధం మినహాయింపునకు యూఎన్ ఆంక్షల కమిటీ అంగీకారం తెలపడంతో.. వచ్చే వారమే ముత్తఖీ న్యూఢిల్లీకి రానున్నట్లు తెలిసింది. 2021లో అప్ఘానిస్థాన్లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్ మంత్రి (Taliban Minister)భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
కాగా, ముత్తఖీ గతనెలలోనే భారత్‌లో పర్యటించాలని అనుకున్నారు. అయితే, ఆయనపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన విదేశీ పర్యటనలపై కూడా నిషేధం ఉంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక మినహాయింపులు అవసరం. దీంతో భారత్ పర్యటనకు తనకు మినహాయింపు ఇవ్వాలని కోరగా.. అందుకు ఆంక్షల కమిటీ ఒప్పుకోలేదు. దీంతో ఆ పర్యటన రద్దైంది. ఇప్పుడు ఆయన విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నుంచి తాత్కాలిక మినహాయింపుకు అంగీకారం లభించినట్లు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో ముత్తఖీ అధికారికంగా భారత పర్యటనకు లైన్ క్లియరైనట్లైంది. ఆయన అక్టోబర్ 9-16 మధ్య న్యూఢిల్లీలో పర్యటించే అవకాశం ఉంది.
Also Read..
Canada Theatre | థియేటర్‌పై వరుస దాడులు.. కెనడాలో భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేత
Vladimir Putin | బయటి ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదు.. అమెరికాకు పుతిన్ కౌంటర్
Sonam Wangchuk | నా భర్తను కలవనివ్వట్లేదు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ భార్య