Vladimir Putin | రష్యా నుంచి చమురు (Russian oil trade) కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా సుంకాల మోత మోగిస్తోన్న విషయం తెలిసిందే. యూస్ చర్యపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తాజాగా స్పందించారు. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం వాషింగ్టన్‌కే ఎదురుదెబ్బ అని హెచ్చరించారు.
దక్షిణ రష్యాలోని సోచిలో జరిగిన ఓ చర్చా వేదికలో పుతిన్ మాట్లాడారు. ‘రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచేలా చేస్తుంది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుంది’ అని పుతిన్ హెచ్చరించారు. అదేవిధంగా భారత్‌తో తమకు ఎప్పుడూ సమస్యలు, అంతర్రాష్ట్ర ఉద్రిక్తతలు లేవని ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. ప్రధాని మోదీ (PM Modi)తో తనకు మంచి స్నేహం ఉందన్నారు. న్యూ ఢిల్లీ బయట ఒత్తిళ్లకు తలొగ్గదని వ్యాఖ్యానించారు. డిసెంబర్లో భారత్‌లో పర్యటించనున్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు.
Also Read..
Planes Collided | న్యూయార్క్‌లో ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. తప్పిన ఘోర ప్రమాదం
Donald Trump | 7 యుద్ధాలు ఆపినా నోబెల్ ఇవ్వరా? ఇది నాకు కాదు.. అమెరికాకే అవమానం