Planes Collided | అమెరికాలోని న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో బుధవారం టాక్సీవేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. రెండు విమానాలను డెల్టా ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ అయిన ఎండీవర్ ఎయిర్ నడుపుతోంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణీకుడు గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత, రెండు విమానాల్లోని ప్రయాణికులను ఖాళీ చేయించి బస్సులో టెర్మినల్‌కు తీసుకెళ్లారని విమానాశ్రయ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విమానం రాత్రి 9.58 గంటలకు టేకాఫ్‌కు సిద్ధమవుతున్న మరో విమానాన్ని ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఫొటోలు, వీడియోలో ఒక విమానం రెక్కలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక గాయపడ్డ ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్పించారు. రెండు విమానాలు బాంబార్డియర్ CRJ-900 మోడల్స్‌కు వచ్చింది. ప్రమాదం అనంతరం డెల్టా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు ఎండీవర్ ఎయిర్ విమానాల మధ్య తక్కువ వేగంతో ఢీకొన్నట్లు పేర్కొంది. ఓ విమానం (5047) నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి వస్తుందని.. మరొక విమానం (5155) వర్జీనియాలోని రోనోక్కు బయలుదేరింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 5155 విమానం రెక్క 5047 విమానానికి తాకింది. విమానం 5155లో 28 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా మొత్తం 32 మంది ఉన్నారు. విమానం 5047లో 57 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 61 మంది ఉన్నారు. ప్రమాదం తర్వాత ప్రయాణికులను హోటల్స్‌కు తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది క్లారిటీ లేదు. ఈ ఘటనతో విమానాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం చూపలేదని విమానాశ్రయం అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది ఎయిర్‌లైన్స్.
🚨 BREAKING: Two Delta jets have collided on the tarmac at LaGuardia in New York
One of the jets actually lost most of its wing.
Amount of passengers or crew injured is not currently known.
pic.twitter.com/hKSm19S8jT— Nick Sortor (@nicksortor) October 2, 2025