Canada Theatre | కెనడాలో భారతీయ చిత్ర ప్రదర్శనలు (Indian Films) నిలిచిపోయాయి. ఇండియన్ సినిమాస్‌ను ప్రదర్శిస్తున్న కారణంగా ఓ సినిమా థియేటర్‌పై (Canada Theatre) కొందరు దుండగులు వరుస దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం.. భారతీయ సినిమాల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పవన్ కల్యాణ్ ఓజీ, రిషభ్ శెట్టి కాంతార చాప్టర్-1 సహా పలు సినిమాల ప్రదర్శన ఆగిపోయింది.
ఒంటారియో ప్రావిన్స్‌లోని (Ontario province) ఓక్విల్ (Oakville) నగరంలో ఉన్న ‘ఫిల్మ్.కా సినిమాస్’ (Film.ca Cinemas) అనే థియేటర్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. తొలుత సెప్టెంబర్ 25న ఈ థియేటర్‌పై దాడి జరిగింది. కొందరు మండే ద్రవాన్ని పోసి నిప్పంటించారు. అప్రమత్తమైన యాజమాన్యం మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత అక్టోబర్ 2న మరోసారి దాడి జరిగింది. థియేటర్ వద్ద దుండగుడు కాల్పులు జరిపాడు. వారం వ్యవధిలోనే రెండుసార్లు దాడి జరగడంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతీయ సినిమాల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. మరోవైపు ఈ వరుస దాడుల వెనుక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..
Sonam Wangchuk | నా భర్తను కలవనివ్వట్లేదు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ భార్య
Wasim Akram | పాక్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం.. హర్యానా యూట్యూబర్ అరెస్ట్
Bomb Threat | తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు