Wasim Akram | పాక్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం.. హర్యానా యూట్యూబర్ అరెస్ట్
Wasim Akram | హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Wasim Akram | న్యూఢిల్లీ : హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అదే హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్‌లో వీడియోలు చేసిన అక్రమ్‌ను బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన వసీం అక్రమ్ గత మూడేండ్ల నుంచి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్రమ్ వాట్సాప్‌ను పరిశీలించగా, నేరపూరిత సందేశాలను గుర్తించామన్నారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. త్వరలోనే అక్రమ్ గూఢచర్యానికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.
అక్రమ్ అరెస్టు ఇలా..
గత వారం ఇదే పాల్వాల్ పోలీసులు.. పాకిస్తాన్ గూఢచారి తౌఫిక్‌ను అరెస్టు చేశారు. తౌఫిక్ ద్వారానే వసీం అక్రమ్ గురించి పోలీసులకు తెలిపింది. దీంతో అక్రమ్‌ను అరెస్టు చేశారు. 2021లో అక్రమ్ పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ డానిష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అక్రమ్, తౌఫిక్ ఇద్దరూ కలిసి ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఐఎస్ఐ, పాకిస్తాన్ హైకమిషన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. భారత్‌కు సంబంధించిన సున్నితమైన వివరాలను ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు విచారణలో బయటపడింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వరుణ్ సింగ్లా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

