Sonam Wangchuk | లద్దాఖ్ (Ladakh) ఉద్యమకారుడు, వాతావరణ హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) అరెస్టుపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో (Gitanjali Angmo) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. తన భర్తను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. సెప్టెంబర్ 26న అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ తన భర్తను సంప్రదించలేకపోతున్నానని.. కనీసం మాట్లాడనివ్వట్లేదని ఆమె ఆరోపించారు.
అంతకు ముందు తన భర్తను విడుదల చేయాలని కోరుతూ గీతాంజలి ఆంగ్మో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం శాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తన భర్తకు పాక్‌తో ఎలాంటి సంబంధాలూ లేవని అందులో పేర్కొన్నారు. వాంగ్‌చుక్ ఉద్యమస్ఫూర్తిని చంపేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రహోదా కల్పించాలని (Ladakh Statehood Clashes) డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం లద్దాఖ్‌లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో నలుగురు మరణించగా,100 మందికిపైగా గాయపడ్డారు. లద్దాఖ్‌లో హింసను రెచ్చగొట్టినట్టు సోనమ్ వాంగ్చుక్పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగినట్లు కేంద్ర హోంశాఖ కూడా తెలిపింది. దీంతో జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్చుక్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read..
Zubeen Garg | జుబీన్ గార్గ్ మృతి కేసు.. ఇద్దరు సన్నిహితులు అరెస్ట్
Bomb Threat | తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు
Wasim Akram | పాక్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం.. హర్యానా యూట్యూబర్ అరెస్ట్