ENGW vs SAW | ఇంగ్లండ్ స్పిన్నర్ల విజృంభణ. స్వల్ప స్కోర్‌కే దక్షిణాఫ్రికా ఆలౌట్
ENGW vs SAW : వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో ఇంగ్లండ్ బౌలర్లు పంజా విసిరారు. గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్‌ను కుప్పకూల్చారు.
ENGW vs SAW : వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో ఇంగ్లండ్ బౌలర్లు పంజా విసిరారు. గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్‌ను కుప్పకూల్చారు. స్పిన్నర్లు లినే స్మిత్ (3-7), నాట్ సీవర్ బ్రంట్(2-5) తిప్పేయడంతో 21 ఓవర్లకు 69 పరుగులకే ఆలౌటయ్యింది. సఫారీ బ్యాటర్లు సమిష్టిగా విఫలమైన చోట వికెట్ కీపర్ సినాలో జఫ్తా 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఊదేస్తే ఇంగ్లండ్‌కు రెండు పాయిట్లతో పాటు భారీ రన్‌రేటు సొంతమైనట్టే.
మహిళల వరల్డ్ కప్‌లో ఏకపక్ష మ్యాచ్‌కు తెరతీసింది ఇంగ్లండ్. మెగా టోర్నీ తొలి పోరులో బౌలర్లు రాణించడంతో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ లారా వొల్వార్డ్(5)ను లినే స్మిత్ ఔట్ చేసి ఇంగ్లండ్‌కు శుభారంభమిచ్చింది. ఆ తర్వాత.. తంజిమ్ బ్రిట్స్(5), సునే లుస్(2)లను బౌల్డ్ చేసిన స్మిత్ సఫారీలను దెబ్బతీసింది. అనంతరం.. మరినే కాప్ (4)సైతం పెవిలియన్ చేర్చిన ఆమె దక్షిణాఫ్రికాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. టాపార్డర్ బ్యాటర్లు వెనుదిరుగుతున్నా సినాలో జఫ్తా(22) ఒంటరిపోరాటం చేసింది. కానీ, ఆమెను ఎకిల్‌స్టోన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది.
South Africa crash to their second-lowest total in a women’s ODI World Cup 📉
All five of England’s bowlers amongst the wickets with Linsey Smith’s three early strikes setting it up 🔥
👉 https://t.co/wc1uCWCm7F pic.twitter.com/QzHxNXZtZG
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2025
మరో ఎండ్ నుంచి .. నాట్ సీవర్ బ్రంట్(2-5), చార్లీ డీన్(2-14) పోటీపడుతూ వికెట్ల వేట కొనసాగించి సఫారీలను ఆలౌట్ అంచున నిలిపారు. చివరి వికెట్ అయిన మలబా(3)ను డీన్ బౌల్డ్ చేయడంతో సఫారీల ఇన్నింగ్స్ 69 పరుగులవద్ద ముగిసింది. వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే మూడో అత్యల్ప స్కోర్. గతంలో.. 2009లో న్యూజిలాండ్‌పై 51కే ఆ జట్టు కుప్పకూలింది. పాకిస్థాన్‌పై 2019లో 63 రన్స్‌కే సఫారీ టీమ్ ఆలౌటయ్యింది. తక్కువ స్కోర్‌కు ఆలౌట్ కావడం ఇది మూడోసారి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

