IND vs WI : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు(Team India) పట్టు బిగించింది. ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమిండియా.. ముగ్గురు శతకాలతో రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(100), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) విండీస్ బౌలర్లను ఊచకోతకోస్తూ సెంచరీలు బాదారు. అనుభవం లేని కరీబియన్ బౌలింగ్ దళానికి చుక్కలు చూపించిన జురెల్, జడ్డూ.. జట్టు స్కోర్ 400 దాటించారు. జురెల్ ఔటైనా వాషింగ్టస్ సుందర్(9 నాటౌట్) క్రీజులో కుదురుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. ప్రస్తుతానికి గిల్ సేన 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ సమం చేసిన భారత్ స్వదేశంలో అదే జోరు చూపిస్తోంది. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(100), యశస్వీ జైస్వాల్ విండీస్ బౌలర్లను ఉతికేస్తూ గట్టి పునాది వేశారు. మొదటి వికెట్‌కు 68 పరుగులు రాబట్టిన ఈ ద్వయాన్ని జైడెన్ సీల్డ్ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన సాయిసుదర్శన్(7)ను రోస్టన్ ఛేజ్ ఎల్బీగా వెనక్కి పంపగా 90కే రెండు వికెట్లు పడ్డాయి.
📸📸
A special knock calls for a special celebration 😍
Describe KL Rahul’s knock so far 👇
Updates ▶ https://t.co/MNXdZcelkD#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/yX2OK3TVno
— BCCI (@BCCI) October 3, 2025
ఆదశలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(50), ధ్రువ్ జురెల్(125)అండగా ఇన్నింగ్స్ నిర్మించాడు రాహుల్. తనదైన షాట్లతో అలరించిన అతడు.. గిల్‌తో 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గిల్ ఔటయ్యాక.. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(125) సాయంతో చెలరేగిన రాహుల్ టెస్టుల్లో 11వ సెంచరీ సాధించాడు. వర్రికన్ ఓవర్లో రాహుల్ జస్టిన్ గ్రీవ్స్ చేతికి చిక్కడంతో.. ఎట్టకేలకు 218 వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.
That’s Stumps on Day 2!
1⃣0⃣0⃣s from KL Rahul, Dhruv Jurel, and Ravindra Jadeja ✅#TeamIndia with a massive lead of 286 runs 💪
Scorecard ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/cyPiBC6V4I
— BCCI (@BCCI) October 3, 2025
ఇండియా ఏ తరఫున ఈమధ్యే ఆస్ట్రేలియాపై సెంచరీతో మెరిసిన జురెల్ విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రిషభ్ పంత్ స్థానంలో తనకు దక్కిన అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకుంటూ ధనాధన్ ఆటతో అలరించాడీ యంగ్‌స్టర్. అతడికి రవీంద్ర జడేజా (104 నాటౌట్) తోడవ్వడంతో వెస్టిండీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
For his father. For the nation. 🇮🇳💯pic.twitter.com/W6uA4Ro5oN
— Rajasthan Royals (@rajasthanroyals) October 3, 2025
ఐదో వికెట్‌కు 206 పరుగులు జోడించి ఆధిక్యాన్ని పెంచారు. మూడో సెషన్లో జురెల్ ఔటైన కాసేపటికే జడ్డూ ఈ ఫార్మాట్లో ఆరో శతకం పూర్తి చేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్(9 నాటౌట్) వికెట్ల నష్టానికి రన్స్ చేసిన భారత్ ఆధిక్యంతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లీడ్ 350 ప్లస్ చేరాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారంటే.. విజయం తథ్యమే.
It’s another Ravindra Jadeja special ⚔
Solid knock from the #TeamIndia vice-captain so far 👏#INDvWI | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/f2xDnjrq1t
— BCCI (@BCCI) October 3, 2025