లీడ్స్: ఇంగ్లండ్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి వన్డేలోనే అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి పోరులో సౌతాఫ్రికా.. 7 వికెట్ల తేడాతో గెలిచింది.
తొలుత ఇంగ్లండ్.. మహారాజ్ (4/22), మల్డర్ (3/33) ధాటికి 24.1 ఓవర్లలో 133కే ఆలౌట్ అయిం ఛేదనను సఫారీలు 24.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి దంచేశారు. మార్క్మ్ (86), రికెల్టన్ (31) రాణించారు.