Road accident : వాహనం అదపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు (Police officers) మరణించారు. ఒక మహిళా కానిస్టేబుల్ (Woman conistable) గల్లంతయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని ఉజ్జెయిని (Ujjain) నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన మహిళా కానిస్టేబుల్ కోసం గాలింపు కొనసాగుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. చింతామన్ ఏరియాలో ఏరియాలో 14 ఏళ్ల బాలిక కనిపించకుడా పోయిందనే సమాచారం అందడంతో.. ఉన్హేల్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అశోక్ శర్మ, ఎస్ఐ మదన్‌లాల్ నినామా, మహిళా కానిస్టేబుల్ ఆర్తి పాల్ తెలుపురంగు పోలీస్ కారులో చింతామన్ బయలుదేరారు. డ్రైవింగ్ చేస్తున్న ఆర్తి పాల్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపుతప్పి షిప్రా నదిలోకి దూసుకెళ్లింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్స్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అశోక్ శర్మ, మదన్‌లాల్ మృతదేహాలను వెలికితీశారు. అయితే కారు నడిపిన ఆర్తీపాల్ ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఆమె కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.