KCR | తెలంగాణలో మళ్లీ తమ జీవితాలు బాగుండాలంటే మళ్లీ సారే రావాలి అని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలంటూ ఆయన చిత్రపటానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా(కె) రైతులు మంగళహారతులు ఇచ్చి పూజలు చేశారు.
ఈ సందర్భంగా రైతన్నలు మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట పంటకు రైతుబంధు ఇచ్చే వాళ్లని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నికల సమయానికి రైతు భరోసా వస్తుందని తెలిపారు. రుణమాఫీ కూడా సగం మందికే అయ్యిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ఇంటికే యూరియా వచ్చేదని కానీ ఈ కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు వచ్చాయని ఆవేదన చెందారు.
తెలంగాణలో మళ్ళీ రైతుల జీవితాలు బాగుపడాలంటే మళ్ళీ సారే రావాలి.. కేసీఆరే కావాలి అంటూ కేసీఆర్ చిత్రపటానికి మంగళ హారతులిచ్చి పూజలు చేసిన ముఖ్రా(కె) రైతులు.
కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు రైతుబంధు ఇచ్చే వాళ్ళు, కానీ కాంగ్రెస్ పాలనలో ఎన్నికల సమయానికి రైతు భరోసా వస్తుందని, సగం మందికే రుణమాఫీ… pic.twitter.com/X6zpyt3NYD
— BRS Party (@BRSparty) September 8, 2025
కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలకు మోసం చేసిందని రైతన్నలు మండిపడ్డారు. రైతుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. తమ బతుకులు బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ సారే రావాలని ప్రతి పల్లెలో ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కేసీఆర్ గుర్తుకువస్తున్నాడని అన్నారు. అందుకే మళ్లీ తెలంగాణలో సారే రావాలి, కారే కావాలి అని కేటీఆర్ చిత్రపటానికి మంగళహారతులు ఇచ్చి పూజలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీ గాడ్గే సుభాష్ పాల్గొన్నారు.