US Open | యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ (US Open) విజేతగా స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) నిలిచాడు. టాప్‌సీడ్ యూనిక్ సిన్నర్ (Jannik Sinner)తో హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో అల్కరాజ్ మళ్లీ ప్రపంచ నంబర్ 1 స్థానం దక్కించుకున్నాడు. మొత్తం 2.42 గంటల పాటు సాగిన నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్‌ను ఈజీగా నెగ్గిన అల్కరాస్.. రెండో సెట్లో సిన్నర్ పైచేయి సాధించాడు. మళ్లీ తేరుకున్న 22 ఏండ్ల స్పెయిన్ సంచలనం మూడో సెట్లో విజృంభించి 6-1 తేడాతో 24 ఏండ్ల ఇటలీ స్టార్‌ను మట్టికరిపించాడు. కీలక నాలుగో సెట్లో కూడా 6-2తో పైచేయి సాధించిన అల్కరాజ్ విజేతగా నిలిచాడు. దీంతో రెండో సారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. మొత్తంగా అతనికిది ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2022లో తొలిసారిగా యూఎస్ ఓపెన్‌ను దక్కించుకున్న అల్కరాజ్.. మళ్లీ మూడేండ్ల తర్వాత ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబూల్డన్ తర్వాత ముచ్చటగా మూడోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఇరువురు ఆటగాళ్లు పోటీపడ్డారు. ఫ్రెంచ్ ఓపెన్‌ను అల్కరాజ్ గెలుచుకోగా, వింబుల్డన్‌ను సిన్నర్ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో ఒకే ఏడాదిలో అల్కరాస్ రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గినట్లయింది. 2024 నుంచి ఎనిమిది మ్యాచ్‌లలో ఈ ఇద్దరు ఆటగాళ్లు తపడగా ఆరింటిలో సిన్నర్ గెలువగా, అల్కరాజ్ రెండింటిలో మాత్రమే విజయం సాధించాడు. అవికూడా ఫైనల్స్ కావడం గమనార్హం.
యూఎస్ ఓపెన్- 2022
వింబుల్డన్- 2023
రొలాండ్ గరోస్- 2024
వింబుల్డన్- 2024
రొలాండ్ గరోస్-2025
యూఎస్ ఓపెన్-2025