కాసిపేట : రోడ్డుపై ( Road ) వెళితే అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లిస్తున్నాను. అయినా గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించడంలో కాంగ్రెస్ ( Congress ) విఫలం చెందింది. దీనికి జరిమానగా తనకు ఏమి చెల్లిస్తారంటూ దండోరా నాయకుడు రోడ్డుపై బైటాయించి నిరసన ( Protest ) తెలిపారు. మాదిగ హక్కుల దండోరా సంఘం కాసిపేట మండల అధ్యక్షులు అటుకపురం రమేష్ ( Ramesh ) ప్లేకార్డు ప్రదర్శించి గతుకుల, బురద రోడ్డుపై బైటాయించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప చౌరస్తాలోని రహదారి పూర్తిగా ధ్వంసం అయ్యింది. రెండేళ్లుగా రోడ్డు మొత్తం కుంగిపోయి, ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు కొంత మంది కమీషన్ల కోసం కక్కుర్తి పడి రోడ్డును ఆపుతున్నారని ఆరోపించారు. వెంటనే ఈ రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాసిపేట నుంచి దేవాపూర్ ఎన్నో సార్లు వస్తూ, వెళ్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల దేవాపూర్‌లో యూనియన్ ఎన్నికలు జరిగితే వచ్చిన ఎమ్మెల్యే ఇక్కడి రోడ్డు పరిస్థితిపై ఆసక్తి చూపింకపోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రోడ్డు వేయించాలని కోరారు.