షార్జా: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన యూఏఈ టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్థానీ బౌలర్ మొహమ్మద్ నవాజ్( Mohammad Nawaz) హ్యాట్రిక్ తీశాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై 75 రన్స్ తేడాతో పాకిస్థాన్ విక్టరీ కొట్టింది. ఆ జట్టు బౌలర్ నవాజ్ తన స్పిన్ మంత్రంతో ఆఫ్ఘన్‌ను కట్టడి చేశాడు. ఫైనల్లో 19 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడుతను. 142 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు 15.5 ఓవర్లలో 66 రన్స్‌కే ఆలౌటైంది. పాక్ జట్టులో ఫకర్ జమాన్ 27 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
పాక్ స్పిన్నర్ నవాజ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో చివరి రెండు బంతులకు వికెట్లు తీసుకున్నాడు. దార్విశ్ రసూలీ, అజ్మతుల్లా ఓమర్జాయి వికెట్లను తీశాడతను. అయితే ఆ తర్వాత ఇన్నింగ్స్ 8వ ఓవర్లో తొలి బంతికే ఇబ్రహీమ్ జద్రాన్‌ను ఔట్ చేసి తన ఖాతాలో హ్యాట్రిక్ వేసుకున్నాడతను. టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మూడవ పాకిస్థానీ బౌలర్‌గా నవాజ్ నిలిచాడు. గతంలో ఫమీమ్ అష్రఫ్, మొహమ్మద్ హస్నైన్ హ్యాట్రిక్ తీశారు.
MOHAMMAD NAWAZ HAT-TRICK 🤯pic.twitter.com/bLqBZZuFcj
— PCT Replays 2.0 (@ReplaysPCT) September 7, 2025