న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : వెండి వెలుగులు జిమ్ముతున్నది. శుక్రవారం వెండి చారిత్రక గరష్ఠ స్థాయికి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,41,900 పలికింది. వెండి చరిత్రలో మునుపెన్నడు స్థాయికి ఎగబాకింది. వెండితోపాటు బంగారం పరుగులు పెట్టింది. 10 గ్రాముల పుత్తడి ధర రూ.330 ఎగబాకి రూ.1,17,700 చేరుకున్నది.
ప్రస్తుత పండుగ సీజన్ కావడంతో అతి విలువైన లోహాలకు డిమాండ్ భారీగా పెరిగిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. వెండి ధరలు గురువారం తన రికార్డు స్థాయి రూ.1.40 లక్షలకు చేరుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి 3,744.75 డాలర్లకు పడిపోగా, వెండి 45.03 డాలర్లకు పరిమితమైంది.