న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రధాన నగరాలలోని జిల్లా కోర్టులలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసుల సంఖ్యపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించేందుకు తాజా మార్గదర్శకాలను జారీచేసింది. ఇందులో స్వచ్ఛంద రాజీలు, ప్రొబేషన్‌పై నిందితుల విడుదల వంటివి ఉన్నాయి.
జస్టిస్ మన్మోహన్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి తాజా మార్గదర్శకాలను జారీచేసింది. సెప్టెంబర్ 1 నాటికి ఢిల్లీ జిల్లా కోర్టులలో మొత్తం 6,50,283 చెక్ బౌన్స్ కేసులు,. ముంబై జిల్లా కోర్టులలో 1,17,190, కలకత్తా జిల్లా కోర్టులలో 2,65,985 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది.