పాట్నా: బీహార్‌లో సుదీర్ఘ పోరాటం కోసం జన్ శక్తి జనతా దళ్ పేరిట కొత్త పార్టీని ప్రారంభించినట్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. ఈ పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడినని, బ్లాక్ బోర్డ్ పార్టీ ఎన్నికల గుర్తు అని ఎక్స్‌లో పోస్టర్‌ను పంచుకున్నారు. అయి దు చిన్న పార్టీలు తన నేతృత్వంలో పని చేయనున్నాయని ఆగస్టులో తేజ్ ప్రతాప్ ప్రకటించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య తండ్రి, సోదరులతో విభేదించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. కానీ అందుకు తేజస్వియాదవ్ అంగీకరించలేదని తెలిసింది.