సూచీలకు టారిఫ్ సెగ.. ఫార్మా, ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చడంతో సూచీలు కుదేలయ్యాయి. బ్రాండెడ్ ఔషధ ఎగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించడంతో దేశీయ మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది.
- ఒక్క శాతం వరకు నష్టపోయిన సూచీలు
ముంబై, సెప్టెంబర్ 26 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చడంతో సూచీలు కుదేలయ్యాయి. బ్రాండెడ్ ఔషధ ఎగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించడంతో దేశీయ మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ 733.22 పాయింట్ల నష్టంతో మూడు వారాల కనిష్ఠ స్థాయి 80,426.46 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ సైతం 236.15 పాయింట్లు కోల్పోయి 24,654.70 వద్ద నిలిచింది. ట్రంప్ దెబ్బకు ఫార్మా, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. హెల్త్‌కేర్ ఇండెక్స్ ఏకంగా 2.14 శాతం నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యంపోసింది.
- మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 3.70 శాతం నష్టపోయి లూజర్‌గా నిలిచింది.
- దీంతోపాటు ఎటర్నల్, టాటా స్టీల్, బజా జ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయిం ట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీ, భెల్, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మారుతి షేర్లు కూడా పడిపోయాయి.
- ఎల్అండ్టీ, టాటా మోటర్స్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 2 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు 1.96 శాతం నష్టపోయాయి.
- రంగాలవారీగా టెలికాం 2.69 శాతం నష్టపోగా..ఐటీ 2.43 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 2.34 శాతం, టెక్నాలజీ 2.03 శాతం, కమోడిటీస్ 1.91 శాతం, మెటల్ 1.90 శాతం, సర్వీసెస్ 1.73 శాతం వరకు పతనం చెందాయి.
- గత ఆరు సెషన్లలో సెన్సెక్స్ 2,587.50 పాయింట్లు లేదా 3.11 శాతం నష్టపోగా, నిఫ్టీ 768.9 పాయింట్లు లేదా 3 శాతం పడిపోయింది.
రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరి దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలతో కొనసాగుతుండటంతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన ఆరు సెషన్లలో మదుపరులు రూ.16 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ విలువ రూ.450.85 లక్షల కోట్లకు దిగొచ్చింది. అంతకుముందు వారంలో రూ.466.89 లక్షల కోట్లుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

