మహాభారతంలో ప్రతి పాత్రకూ ఓ కథ ఉంటుంది. ఎవరి కథకు వారే హీరో అన్నట్టుగా వ్యాసుడు మహాభారతాన్ని రచించారు. ఆ ప్రేరణతోనే ‘బాహుబలి’లోని ప్రధాన పాత్రల్లో ఒకటైన కట్టప్ప కోణంలో కథ తయారు చేసే పనిలో పడ్డారు రచయిత విజయేంద్రప్రసాద్. అసలు కట్ట ప్ప ఎవరు? మా హిష్మతి సామ్రాజ్యానికి నమ్మిన బంటుగా కట్టప్ప ఎందుకు మారాడు? కట్టప్ప కుటుంబ నేపథ్యం ఏంటి? ఎందుకు ఏకాకిలా, ఓ బానిసలా ఉండాల్సి వచ్చింది?
అనే అంశాల చుట్టూ ఈ కథ ఉండబోతున్నదని సమాచారం. అయితే.. ఈ కథకు రాజమౌళీనే దర్శకత్వం వహిస్తారా? లేక వేరొకరితో చేయిస్తారా? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి కట్టప్ప ప్రీ విజువలైజేషన్ వర్క్ అయితే మొదలైంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.