మక్తల్, సెప్టెంబర్ 26 : బైకులను అపహరించి ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య తెలిపారు. శుక్రవారం మక్తల్ పోలీస్స్టేసన్లో సీఐ రాంలాల్తో కలిసి డీఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మక్తల్ పట్టణంలోని రహమానియా కాలనీలో ఈనెల 6వ తేదీన ఇంటి ముందు నిలిపిన హోండా షైన్ బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లగా బిలాల్ రహమాన్ మక్తల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని సీఐ రాం లాల్ విచారణ ప్రారంభించగా శుక్రవారం మక్తల్ సబ్స్టేషన్ ఎదుట ఉన్న పెట్రోల్ బంక్లో నిందితులు దొంగలించిన బైకులకు పెట్రోల్ కొట్టించుకున్న సందర్భంలో మక్తల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారి దగ్గర ఉన్న రెండు బై కు లతోపాటు మరో మూడు బైకుల సమాచా రం బయటపడిందన్నారు.
అంతర్రాష్ట్ర ము ఠా అయినటువంటి కుంచు కోరం ఎల్లప్ప తండ్రి కుంచు కోరం ప్రసాద్ హైదరాబాద్, సన్న దుర్గప్ప అలియాస్ దుర్గేశ్ తండ్రి గంగ ప్ప వీరపాపర్, సింధనూర్కు చెందినటువం టి ఇద్దరు వ్యక్తులు పారు చేసిన బైక్లు ఎత్తుకెళ్లి కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా, బసవేశ్వరనగర్కు చెందినటువంటి సోరాపూర్ గ్రామంలోని శంషొద్దీన్కు దొంగలించిన వాహనాలను అమ్మేవారని తెలిసిం ది. వీరి నుంచి మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఒక బైక్, హైదరాబాదులోని సైఫాబాద్ పో లీస్ స్టేషన్ నుంచి మరొక బైకు, గద్వాల జిల్లా అయిజ పోలీస్ స్టేషన్ నుంచి ఒక బైక్, కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బైక్, నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బైకును స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ రూ.4లక్షలు ఉంటుందని చెప్పారు.
అయితే అంతర్రాష్ట్ర దొంగలుగా ఉ న్న ఏ1, ఏ2 వ్యక్తులు రాత్రి సమయాల్లో ఇండ్ల ముందు ఉంచిన బైక్ల తాళాలు పగులగొట్టి, దొంగలించిన బైకులను ఏ 3 కి ఇవ్వడంతో అతడు వాహనాలను ఇతర రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులకు తకువ ధరలకు అమ్మి అక్రమ లాభాలు పొందుతూ, ఆ డబ్బును విలాసవంతమైన ఖర్చులకు వినియోగిస్తున్నారని పేరొన్నారు. ఇదే క్రమం లో దొంగిలించిన రెండు బైకులను హైదరాబాద్లో విక్రయించేందుకు ఏ1, ఏ2 నిందితులు కో రం ఎల్లప్ప, సన్న దుర్గప్పను సీఐ తన సిబ్బంది అరెస్టు చేసిన కోర్టులో హాజరుపర్చి రి మాండ్ చేసినట్లు