Shreyas Iyer | క్రికెట్ అభిమానులకు శుభవార్త.. స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. సిడ్నీ ఆసుపత్రి నుంచి శ్రేయస్ ఇవాళ డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం స్థిరంగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నట్లు వెల్లడించింది. ‘శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు కోలుకుంటున్న తీరుపై బీసీసీఐ వైద్య బృందంతో పాటు సిడ్నీ, భారత వైద్య నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అతడిని ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు’ అని బీసీసీఐ తెలిపింది.
🚨 Medical update on Shreyas Iyer
The BCCI Medical Team, along with specialists in Sydney and India, are pleased with his recovery, and he has been discharged from the hospital today.
Details 🔽 | #TeamIndia https://t.co/g3Gg1C4IRw
— BCCI (@BCCI) November 1, 2025
ఆస్ట్రేలియా (Australia) టూర్లో శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్ అందుకుంటున్న సమయంలో అయ్యర్‌కు గాయమైంది. మూడో వన్డేలో హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ థర్డ్‌మ్యాన్ దిశలో కొట్టిన బంతిని అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టిన అతడు.. ఆ తర్వాత ఎడమవైపు పక్కటెముల నొప్పితో విలవిల్లాడాడు. దీంతో శ్రేయస్ అయ్యర్‌ని సిడ్నీ (Sydney) ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో రెండురోజలుపాటూ చికిత్స పొందిన ఈ స్టార్ ప్లేయర్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పూర్తిగా కోలుకునేందుకు మూడు వారాలకు పైగా సమయం పట్టనుందని సమాచారం.
Also Read..
Shreyas Iyer | క్రమంగా కోలుకుంటున్నా.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్
UPI | అక్టోబర్‌లో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
Varun Chakravarthy: వరుణ్ మైండ్‌గేమ్స్.. ఔటైన టిమ్ డేవిడ్.. నవ్వుకున్న సూర్య.. వీడియో