మెల్బోర్న్: ఇండియాతో మెల్బోర్న్లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా ఈజీ విక్టరీ కొట్టింది. అయితే ఆ మ్యాచ్‌లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ చోటుచేసుకున్నాయి. వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ఆడిన మైండ్ గేమ్‌కు.. ఆసీస్ బ్యాటర్ టిమ్ డేవిడ్ దొరికిపోయాడు. ఆ ఫన్నీ గేమ్స్‌ను కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఎంజాయ్ చేశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జరిగింది.
ఆ ఓవర్లో వరుణ్ రెండో బంతి బౌల్ చేస్తున్న సమయంలో.. అకస్మాత్తుగా టిమ్ డేవిడ్ తన స్టాన్స్ నుంచి పక్కకు జరిగాడు. ఆ తర్వాత బంతికి వరుణ్ తనదైన స్టయిల్లో రియాక్ట్ అయ్యాడు. రన్నప్ తీసుకున్న వరుణ్.. క్రీజ్ వద్దకు వచ్చిన తర్వాత బౌల్ చేయలేదు. టిమ్ డేవిడ్ చర్యకు రెస్పాన్స్‌గా వరుణ్ చక్రవర్తి అలా చేశాడు. ఆ టైంలో కెప్టెన్ సూర్య చిన్నగా స్మైల్ ఇచ్చేశాడు.
అయితే మరో రెండు బంతుల తర్వాత టిమ్ డేవిడ్ .. బౌలరకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లెన్త్‌లో పడిన బంతిని నేరుగా బౌలర్ దిశగా కొట్టాడు డేవిడ్. దీంతో దాన్ని క్యాచ్ పట్టేశాడు వరుణ్. ఈ మ్యాచ్‌లో చక్రవర్తి 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. భారత్ 125 రన్స్ కు ఆలౌట్ అవ్వగా.. ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో టార్గెట్‌ను అందుకున్నది.
Varun Chakaravarthy v Tim David were playing some serious mind games 🧠 #AUSvIND pic.twitter.com/uuUPTSqwDD
— cricket.com.au (@cricketcomau) October 31, 2025