ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైపెండ్ వివరాలివ్వండి: హైకోర్టు
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైపెండ్ ఉపసంహరణ వ్యవహారంపై వివరాలు అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైపెండ్ ఉపసంహరణ వ్యవహారంపై వివరాలు అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు నోటీసులిచ్చింది. ైస్టెపెండ్ను అక్రమంగా ఉపసంహరించడంపై దర్యాప్తు జరిపేలా ఎన్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ దేశాలు ఇవ్వాలంటూ విద్యార్థులు పంపిన ఈ-మెయిల్స్‌ను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది.
ప్రైవేట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించాలని ఎన్ఎం సీ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని, ఇంటర్న్‌షిష్ మంజూరు కు ముందు కాలేజీలు ఖాళీ చెక్‌లపై సంతకాలు తీసేసుకుంటున్నాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

