ప్రభుత్వోద్యోగాల్లో గరం..నరం..బేషరం!
‘రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు రకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగాల్లో చేరిన మొదట ఉడుకు రక్తంతో గరంగా ఉంటారు. కొంతకాలం తర్వాత నరం మెత్తబడుతుంది.
- అధికారులు సామాజిక బాధ్యత ఎప్పటికీ మరువొద్దు
- గ్రూప్-1, 2 అధికారుల శిబిరంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తేతెలంగాణ): ‘రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు రకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగాల్లో చేరిన మొదట ఉడుకు రక్తంతో గరంగా ఉంటారు. కొంతకాలం తర్వాత నరం మెత్తబడుతుంది. మరికొంత కాలమయ్యాక బేషరంగా వ్యవహరిస్తూ తప్పిదాలకు పాల్పడుతారు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన గ్రూప్-1, గ్రూప్-2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో సామాజిక బాధ్యతను మరువొద్దని సూచించారు. ప్రజాపాలనలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మీరు సేవలను అదించబోతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారని, ఆధిపత్యాన్ని ఒప్పుకోరని స్పష్టంచేశారు.
అధికారులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరుల స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పరీక్షలపై అవగాహన ఉన్న అధికారులు, సభ్యులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. అధికారులు పేదవారికి సాయం చేసేముందు తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని కోరారు. కన్నవారిని పట్టించుకోని వారి జీతంలో 10 నుంచి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేస్తామని ప్రకటించారు. త్వరలోనే హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంసీహెచ్ఆర్డీ మధ్య అవగాహన ఒప్పందం జరుగనున్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

