Sharwanand | టాలీవుడ్ హీరోలు సినిమాల కోసం తమ లుక్‌లో చేసే మార్పులు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుంటాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో చేరారు చార్మింగ్ స్టార్ శర్వానంద్ . కొత్త మూవీ కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో, సన్నగా మారిన కొత్త లుక్‌లో శర్వా ఫోటోలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా స్లిమ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్న శర్వానంద్‌ను చూసి నెటిజన్లు “ఇది శర్వానందేనా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
యూత్ ట్రెండ్‌కు తగినట్లుగా ఆయన ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన “బైకర్” ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో శర్వా రేసర్‌గా నటిస్తున్నారు. ఆ లుక్ కోసం ఆయన కొన్ని నెలల పాటు కఠినమైన వర్కౌట్స్, డైట్ ఫాలో అయ్యారని సమాచారం. అయితే శర్వా లుక్ వెనక విదేశాలకి చెందిన ఫిట్నెస్ లేడి ట్రైనర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె పర్యవేక్షణలో శర్వానంద్ ఇలాంటి లుక్‌లోకి మారాడని తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియో చూస్తుంటే శర్వానంద్ మంచి సక్సెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్టు అర్ధమవుతుంది.
ఈ మూవీలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విక్రమ్ సమర్పకుడు. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ శర్వా తండ్రిగా, బ్రహ్మాజీ , అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1990–2000 దశకాల్లో సాగే రేసింగ్ థీమ్ కథతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో శర్వా చేసిన సినిమాలు హిట్స్‌గా నిలిచిన నేపథ్యంలో, “బైకర్” కూడా అదే విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది.
ఇక శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న “నారీ నారీ నడుమ మురారి” వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య,సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో “భోగి” , శ్రీను వైట్ల తో మరో కొత్త ప్రాజెక్ట్‌లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.
#Fitness శర్వానంద్ ఫిట్ నెస్ ట్రైనింగ్ pic.twitter.com/K7KHa1LtsR
— devipriya (@sairaaj44) November 1, 2025